జగన్ వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్ ఇదే..

Pawan kalyan, Janasena, YCP, CM Jagan,YS Jagan Comments,Pawan Kalyan Sensational Comments,pawan kalyan latest updates,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Ap political updates,Mango News Telugu, Mango News
Pawan kalyan, Janasena, YCP, CM Jagan

ఏపీలో కొద్దిరోజులుగా వాలంటీర్లకు సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతేడాది వారాహియాత్రలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు అదృశ్యమయ్యారన్న పవన్.. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జాబితా సేకరిస్తున్నందునే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపాయి. వాలంటీర్లు, అధికారపక్ష నేతలు పవన్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.

అయితే ఇటీవల ఓ సభలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ భగ్గుమన్నారు. ప్రతిపక్షాలు వాలంటీర్లను విమర్శిస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉన్నారని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను తాము దేవుళ్లుగా చూస్తున్నామన్న జగన్.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

అటు వెంటనే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అవుతూ.. వాలంటీర్లను తాము ఎప్పుడూ ఒక మాట అనలేదని స్పష్టం చేశారు. మహిళల అదృశ్యం వెనుక వారు ఉన్నారని ఏనాడూ చెప్పలేదన్నారు. ప్రజలకు సంబంధించిన వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని.. ఆ జాబితాను హైదరాబాద్‌లోని ఓ కంపెనీకి అందిస్తున్నారని మాత్రమే చెప్పానని పవన్ వివరించారు. అక్కడి నుంచి ఆ జాబితా సంఘ వ్యతిరేక శక్తులకు చేరుతోందని.. అలా మహిళలు అదృశ్యమవుతున్నారని అన్నారు. తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదని పవన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nineteen =