తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌ను లూటీ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను తమవైపు రప్పించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలను దక్కించుకుంది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, నిజామాబాద్‌పై మంచి పట్టు ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 34కు చేరుకుంది.
ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారంకు మంత్రి పదవి ఆఫర్ చేశారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై మంచి పట్టు న్న పోచారం రాకతో కాంగ్రెస్‌కు కచ్చితంగా మేలు జరుగుతుందని.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మరింత మైలేజ్ వస్తుందని రేవంత్ రెడ్డి భావించారట. కానీ మంత్రి పదవిని పోచారం శ్రీనివాస్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారట. తనకు మంత్రి పదవి వద్దని తేల్చి చెప్పారట. సాధరణంగా ఎవరైనా పదవుల కోసమే పార్టీ మారుతుంటారు. కానీ పార్టీలోకి ఆహ్వానించి మరీ పదవి ఇస్తుంటే పోచారం శ్రీనివాస రెడ్డి తిరస్కరించారట.
పోచారం మంత్రి పదవిని తిరస్కరించడం వెనుక కూడా బలమైన కారణం ఉందట. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి అందరిలానే మంత్రి పదవి కోసం పార్టీ మారారా అనే ప్రశ్న జనాల మదిలో మెదులుతుంది. అలాగే అది నెగటీవ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ కూడా పదవులు ఆశ చూపి కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందని రివర్స్ అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే మంత్రి పదవిని పోచారం తిరస్కరించారట. తనకు, పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
అయినప్పటికీ మంత్రి పదవి కాకపోయినా వేరే ఏదైనా పదవి పోచారం శ్రీనివాస రెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. ఈక్రమంలో ప్రభత్వ సలహాదారుగా పోచారంను నియమించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి చర్చించారట. అటు సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ పదవికి అయినా పోచారం ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY