రేపటి నుంచే యాసంగి రైతుబంధు పంపిణీ, పదోవిడతలో 70.54 లక్షల రైతుల ఖాతాల్లో రూ.7676.61 కోట్లు జమ

Rythu Bandhu 10th Installment, Rythu Bandhu Rs 7676.61Cr will Deposit in Accounts of 70.54 Lakh Farmers, Mango News, Mango News Telugu, Rythu Bandhu 10th Installment Payment, rythu bandhu latest news,rythu bandhu scheme,rythu bandhu balance check,rythu bandhu latest news today,rythu bandhu 2022,rythu bandhu latest news today 2022,rythu bandhu 2022 update,rythu bandhu 2022 telangana, rythu bandhu status 2022 telangana, kcr rythu bandhu

రాష్ట్రంలో రేపటి నుంచి (డిసెంబర్ 28, బుధవారం) రైతుల ఖాతాల్లో యాసంగి రైతు బంధు నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ యాసంగి సీజన్ లో పదో విడత రైతుబంధులో భాగంగా అర్హులయిన 70.54 లక్షల మంది రైతులుకు గాను ఎకరానికి రూ.5 వేలు చొప్పున కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు రూ.7676.61 కోట్లు కోట్లు జమ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రేపటి నుండి పదో విడత రైతుబంధు నిధుల పంపిణీ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ:

ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి, ఈ పదో విడతతో కలుపుకుని మొత్తం రూ.65,559.28 కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ చేసినట్టు అవుతుందని మంత్రి అన్నారు. “గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ.7434.67 కోట్లు రైతుబంధు నిధులు జమ చేశాం. అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరెంటు, సాగునీళ్లు రైతుల హక్కు. దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఉపాధిహామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించను, పంటలకు మద్దతుధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారు. రైతుల విషయంలో పాలకుల దృక్పధం మారాలి” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =