తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 వ తేది నుంచి 9,10 వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తాజాగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువడింది. రేపటి నుంచి (ఫిబ్రవరి 24, బుధవారం) 6,7,8 తరగతుల విద్యార్థులకు కూడా పాఠశాలలు ప్రారంభించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6,7,8 తరగతులను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఈ తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చుని చెప్పారు. అయితే అన్ని పాఠశాలల వద్ద కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే ఆయా తరగతుల విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ