ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Govt Issues GO Over Regulation of School Fees for the Academic Year 2021-22, govt orders private schools not to raise school fees, Mango News, private schools fees, Regulation of School Fees, Telangana Govt, Telangana govt directs private schools not to increase fees, Telangana govt directs schools not to hike fees, Telangana Govt Issues GO Over Regulation of School Fees, Telangana Govt Issues GO Over Regulation of School Fees for the Academic Year 2021-22, Telangana govt orders private schools not to raise school fees

రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదని, ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, స్కూల్స్ గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.75 జారీ చేసింది. రాష్ట్రంలోని స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కు ఆదేశాలిచ్చారు. ఈ జీవో రాష్ట్ర బోర్డు పరిధిలోని స్కూళ్లకు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా ఇంటర్నేషనల్ బోర్డులలో గుర్తింపు పొందిన స్కూళ్లకు వర్తిస్తుందని, ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =