జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: కొత్త నోటిఫికేషన్ కోరుతూ జనసేన పార్టీ పిటిషన్

2021 AP Municipal Elections, AP Municipal Elections, AP Municipal Elections 2021, AP Municipal Elections News, High Court Seeking New Notification for ZPTC, Janasena, Janasena Party, Janasena Party Files Petition in High Court Seeking New Notification for ZPTC, Mango News, MPTC Elections in AP, Nadendla Manohar, ZPTC, ZPTC MPTC Elections in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో సమయం లభించలేదనీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఏపీ హైకోర్టు జనసేన పిటిషన్ ను స్వీకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

సోమవారం సాయంత్రం కాకినాడలో నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ “గత ఏడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ప్రభుత్వం ఎన్నో అవకతవకలకు పాల్పడింది. అందుకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. కొత్తగా నోటిఫికేషన్ ఇస్తేనే ప్రజాస్వామ్యాన్ని బతికించినట్టవుతుంది. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉండాలి. భవిష్యత్తులో యువతకు కూడా ఎక్కువగా అవకాశాలు రావాలి” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =