టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

Aasara Pensions By KCR, CM KCR Chairs High Level Review Meeting, CM KCR Chairs High Level Review Meeting on TSRTC Economic Situation, CM KCR High Level Review Meeting On TSRTC At Pragathi Bhavan, KCR High Level Review Meeting on TSRTC Economic Situation, KCR On Telangana RTC Economic Situation, Review Meeting On TSRTC At Pragathi Bhavan, Review Meeting on TSRTC Economic Situation, RTC Economic Situation, Telangana RTC Economic Situation, TSRTC Economic Situation

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద చర్చించారు. అలాగే అటు కరోనా, ఇటు పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన విధి విధానాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ