హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం

High Alert Declared In Hyderabad,High alert declared in Telangana in view of J&K developments,cancellation of Article 370 for Jammu and Kashmir,144 section,V C Sajjanar,high alert in all states, High Alert Declared In Hyderabad Over Article 370 Issue,Article 370 Issue,#Article370,article 370 kashmir, jammu and kashmir, article 370 debate, what is article 370, article 370 issue, mehbooba mufti on article 370, article 35a in kashmir, article 370 jammu and kashmir, article 35a history, article 35a and 370, what is article 35a, article 35a kashmir

జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోం మంత్రి అమిత్‌ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలోని మిగతా అన్ని రాష్టాల లాగానే కేంద్రప్రభుత్వ పరిధి లోకి వచ్చింది. ఆర్టికల్ 370 ను రద్దు చేసిన నేపథ్యంలో, దేశంలోని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాల్లో సున్నితమైన ప్రాంతాల్లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తంగా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ డిజిపి మహేంద్రరెడ్డి అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లును, జిల్లా ఎస్పీలను తమ పరిమితుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో అప్రమత్తతతో ఉండి పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో మూడు పోలీసు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మరియు తెలంగాణలోని ఇతర నగరాలలో ఉన్న సీనియర్ పోలీసు అధికారులుతో మాట్లాడి తమ సిబ్బందిని అప్రమత్తం చేసి, కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. నగరంలో ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని, పూర్తిగా నిషేధిస్తునట్టు తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి సి సజ్జనార్ మాట్లాడుతూ వారి పరిధిలో కొన్ని చోట్ల ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here