నేడు డా. బీఆర్ అంబేద్క‌ర్ ‌జయంతి.. ఘనంగా నివాళులర్పించిన మంత్రి కేటీఆర్

Minister KTR Pays Tribute To Dr BR Ambedkar on His Birth Anniversary, Minister KTR Pays Tributes To Dr Ambedkar on The Occasion of His Birth Anniversary, Minister KTR paid tribute to Dr Baba Saheb Ambedkar on his 131st birth anniversary, Dr Baba Saheb Ambedkar on his 131st birth anniversary, Dr Baba Saheb Ambedkar birth anniversary, 131st birth anniversary, Dr Baba Saheb Ambedkar, Minister KTR Pays Tributes To Dr Ambedkar, Ambedkar 131st birth anniversary, Ambedkar birth anniversary News, Ambedkar birth anniversary Latest News, Ambedkar birth anniversary Latest Updates, Ambedkar birth anniversary Live Updates, Life should be great rather than long, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

నేడు భార‌తదేశ రాజ్యాంగ రూపకర్త డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయనకు ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ డాక్ట‌ర్ అంబేద్క‌ర్‌ గురించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ పెట్టారు. మనం చనిపోయాక కూడా అందరూ మనల్ని గుర్తుంచుకునేంత గొప్పగా బ్రతకడమే అసలైన జీవితమని చెప్పిన అంబేద్క‌ర్ సూక్తిని కేటీఆర్ పంచుకున్నారు. దశాబ్దాల క్రితం డాక్ట‌ర్ అంబేద్క‌ర్ రూపొందించిన భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన రచించిన రాజ్యాంగమే దోహదపడిందని, ఈ రోజున ఆ మహానుభావుడిని స్మరించుకోవడం మన బాధ్యతని కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరులోగా పీవీఆర్ మార్గ్‌లో 125 అడుగుల పొడవైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, విగ్రహానికి సమీపంలో ఒక మ్యూజియం మరియు ధ్యాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా దీనిని పర్యాటక కేంద్రంగా మార్చనుంది. ఈమేరకు నిన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి సమాచార సాంకేతిక శాఖ మంత్రి కెటి రామారావు విగ్రహాన్ని పరిశీలించేందుకు పివిఆర్ మార్గ్ వద్ద స్థలాన్ని సందర్శించారు. 11 ఎకరాల పార్కులో 55 అడుగుల నేలమాళిగలో 125 అడుగుల పొడవుతో విగ్రహం రానుందని, రూ. 150 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − three =