విలీన గ్రామాల్లో కూడా సాదాబైనామాల క్రమబద్దీకరణ, వారం రోజులు గడువు: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Decided to Regularise SadaBainamas Free of Cost, SadaBainamas Free of Cost, SadaBainamas Free of Cost in Villages which Merged with Municipalities, telangana, Telangana CM KCR, Telangana News, Telangana SadaBainamas Free of Cost, Villages Merged with Municipalities

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ కార్పోరేషన్ లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిపాలిటీల పరిధిలోని విలీన గ్రామాల్లో సాదాబైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ