ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో భేటీ?

CM KCR Delhi Tour Likely to Meet Delhi CM Arvind Kejriwal and Other National Leaders, CM KCR Delhi Tour, CM KCR Likely to Meet Delhi CM Arvind Kejriwal and Other National Leaders, Delhi CM Arvind Kejriwal and Other National Leaders, Delhi CM Arvind Kejriwal, National Leaders, KCR Delhi Tour, Delhi Tour, Telangana CM KCR, CM KCR, Telangana, Chief minister, Chief minister Of Telangana, CM Arvind Kejriwal, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సోమవారం రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు జాతీయనేతలతో భేటీ కానున్నట్టు తెలుస్తుంది. బీజేపీ వ్యతిరేక కూటమి, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఇటీవలే ముంబయి పర్యటించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజాగా ఢిల్లీ పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 రోజులపాటుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, అధికారులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ