తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 29 శాతం పిట్ మెంట్?

Govt Employees Unions, KCR Hold Meeting with Representatives of Govt Employees Unions, KCR Meeting with Representatives of Govt Employees Unions, Mango News, Meeting with Representatives of Govt Employees Unions, Representatives of Govt Employees Unions, Telangana CM KCR, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections News, Telangana MLC Elections Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో పీఆర్సీ నివేదికకు సంబంధించి టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం, పీఆర్టీయూ, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై దాదాపుగా నాలుగు గంటల పాటుగా సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశం సందర్భంగా ఫిట్‌మెంట్‌, పదవీవిరమణ, పదోన్నతులు, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 29% ఫిట్‌మెంట్‌ ను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు ప్రకటించిన 27% కంటే వేతన సవరణ రెండు శాతం ఎక్కువే ఉండబోతున్నట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలిపినట్టు సమాచారం. ఉద్యోగులకు పీఆర్సీపై మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని, అది కూడా మార్చి నెలనుంచి అమల్లోకి రానున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ఉండడంతో, కోడ్ ముగిసిన తర్వాత ఇతర అంశాలపై కూడా ఉత్తర్వులు జారీచేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ