తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఈ నెలలో పూర్తి వేతనాలు చెల్లించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ముందుగా కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీతాలలో కొంత శాతం కోత విధించిన సంగతి తెలిసిందే. కాగా లాక్‌డౌన్ సడలింపులు అనంతరం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడంతో ఈ నెలలోవారికీ పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu