యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సోమవారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. మార్చి 15, సోమవారం నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 25వ తేదీ దాకా, పదకొండు రోజులపాటుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ను కలిసినవారిలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అర్చకులు, తదితరులున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ