ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR directs officials to ensure safety for women staff, K Chandrasekhar Rao, KCR ensure safety for women staff, KCR Orders over Safety and Wellbeing of Women Employees, KCR Orders over Safety and Wellbeing of Women Employees in all Govt Offices, Mango News, Safety and Wellbeing of Women Employees, Telangana CM KCR, Telangana ensure safety for women staff, Telangana News

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో సీఎం కేసీఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖల వారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సీఎం అప్పగించారు. తమ పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ