సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు

China, India, India china, India China Border Affairs, India China border clash, India China Border Conflicts, india china border dispute, India china clash, India China soldiers clash at Naku La Pass, India Chinese Soldiers Clash, India Chinese Soldiers Clash At Sikkim Border, Indian Chinese Troops Clash at Sikkim Border, Indian soldiers thrash, Mango News, Sikkim Border, Troops of India

భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తూర్పు లద్దాఖ్‌ ఘటన అనంతరం ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలతో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే, తాజాగా సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్‌, చైనా జవాన్లు మధ్య భౌతిక ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. భారత జవాన్లు చొరబాటును అడ్డుకుని పీఎల్ఏ జవాన్లను విజయవంతంగా వెనక్కు పంపారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో భారత్ నుంచి నలుగురు జవాన్లు, 20 మంది చైనా జవాన్లు గాయపడినట్టు సమాచారం. కాగా ఘర్షణ సమయంలో ఇరుదేశాల సైనికులు ఆయుధాలను ఉపయోగించలేదని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 3 =