జీహెచ్‌ఎంసీలో పోలింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపివేత

GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Liquor Shops, GHMC Liquor Shops Closed, Greater Hyderabad Municipal Corporation, Liquor Shops to be Closed, Liquor Shops to be Closed From Today, Liquor Shops to be Closed in GHMC Limits, Mango News

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో నవంబర్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. అలాగే ఈ లోపులో పెద్దమొత్తంలో మద్యం విక్రయాలు జరపడంపై కూడా రాష్ట్రఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఏ వ్యక్తులకైనా, గ్రూపులకైనా పెద్ద మొత్తంలో‌ మద్యం అమ్మితే, ఆ మద్యం దుకాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఓటర్లు మద్యం వలన ప్రలోభానికి గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక మద్యం విక్రయాలు నిలిపివేసిన సమయంలో వేరే ప్రాంతాల నుండి జీహెచ్‌ఎంసీ పరిధిలోకి మద్యం సరఫరా లేదా రవాణా జరగకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =