రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. త్వరలోనే విరమణ వయసు పెంపు నిర్ణయం అమలులోకి వస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు రాజేంద్రనగర్‌లోని టీఎస్‌ఐఆర్‌డీలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిపై కీలక ప్రకటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సీఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని, అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని వెల్లడించారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో ధూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
[subscribe]
[youtube_video videoid=09piP5rUg4g]










































