కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ అరెస్ట్

ED Officials Arrests Congress leader DK Shivakumar, ED Officials Arrests DK Shivakumar, ED Officials Arrests Karnataka Congress leader DK Shivakumar, Karnataka Congress leader DK Shivakumar, Karnataka Congress leader DK Shivakumar Arrest, Karnataka Political News, Karnataka Political updates, Mango News Telugu, Officials Arrests Karnataka Congress leader DK Shivakumar

కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసారు. గత కొన్ని రోజులుగా డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కు సంబంధించి ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 31 ప్రారంభమైన విచారణ సెప్టెంబర్ 3 వరకు కొనసాగించారు, విచారణ సమయంలో డీకే శివకుమార్ సహకరించడం లేదని ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. గతంలో ఆయన నివాసంలో ఐటీ అధికారులు దాడులు జరిపి రూ. 8.59 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖ కేసు నమోదు చేయగా, సంబంధిత విచారణను ఈడీ జరుపుతుంది. సెప్టెంబర్ 3న ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణ అనంతరం, రాత్రి 8 గంటల సమయంలో శివకుమార్ ను అరెస్ట్ చేసారు.

అయితే డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పరిస్థితుల దృష్ట్యా బెంగుళూరు, మండ్య, హాసన్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో యడ్యూరప్ప ప్రభుత్వం భద్రతను పెంచి, పోలీస్ బలగాలను మోహరించారు. మరో వైపు మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, కుమార స్వామి డీకే శివకుమార్ అరెస్ట్ ను ఖండించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతిపక్ష నాయకులను దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here