ఆరవ విడత హరితహారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

6th Phase Haritha Haram, 6th Phase Haritha Haram Programme, Haritha Haram, Haritha Haram Program, Haritha Haram Program in Telangana, Haritha Haram Programme, Haritha Haram Programme in Narsapur, KCR to Start 6th Phase Haritha Haram Programme, Medak District

ఆరవ విడత “తెలంగాణకు హరితహారం” కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 25, గురువారం నాడు ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నర్సాపూర్‌లో 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా కార్యాచరణకు సిద్ధం చేసింది. ఈ విడత హరితాహారం కార్యక్రమంలో అటవీ, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖతో సహా మొత్తం 34 శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. కాగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu