మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్

Bhuma Akhila Priya Arrested In Hyd, Bhuma Akhilapriya, Bhuma Akhilapriya Arrested, Bhuma Akhilapriya Kidnap Case, Bhuma Akhilapriya Kidnap Case News, Boyanapalli kidnap case, Chief Minister of Telangana, Ex-minister Bhuma Akhila Priya was Remanded, Ex-minister Bhuma Akhila Priya was Remanded for 14 Days, Ex-Minister Bhuma Akhilapriya Arrested, Kidnap case, Mango News, TDP ex-minister arrested in kidnap case

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బుధవారం నాడు భూమా అఖిలప్రియను సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఆమెకు 14 రోజుల రిమాండ్ విధిస్తునట్టుగా జడ్జి ప్రకటించారు. ఈ క్రమంలో అఖిలప్రియను పోలీసులు బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. గురువారం నాడు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలింనున్నారు.

ఇక రిమాండ్ విధింపు అనంతరం ఆమె బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ బెయిల్‌ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగనుంది. బోయినపల్లి కిడ్నాప్ కేసు ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ2 భూమా అఖిలప్రియను, ఏ3 గా భార్గవ రామ్‌ను చేర్చినట్టు సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న భార్గవరామ్ సహా మరికొందరికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =