కర్ణాటకలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు

#Karnataka, Karnataka Coronavirus, Karnataka Coronavirus News, Karnataka Coronavirus Updates, Karnataka SSLC 2020 Pending Exams, Karnataka SSLC Exam 2020, karnataka sslc exam news, Karnataka SSLC Exams, Karnataka SSLC Exams 2020, Karnataka SSLC Exams Begins, SSLC exams

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు, ఆంధప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం పదో తరగతి పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. జూన్ 25, గురువారం నాడు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ‌అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, అనంతరం వారికి శానిటైజర్‌, మాస్కులు అందించారు. రాష్ట్రంలో అన్ని పరీక్షా కేంద్రాలను ముందుగానే శానిటైజ్‌ చేశామని, భౌతిక దూరం నిబంధనల అనుగుణంగా ఏర్పాట్లు చేశామని విద్యార్థులంతా భయపడకుండా పరీక్షలు రాయవచ్చని ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. అలాగే పరీక్షాకేంద్రాల వద్ద ప్రతి 200 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఆరోగ్య సిబ్బందిని నియమించినట్టు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − nine =