వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్

Dokka Manikya Varaprasad Filed Nomination for MLC As YSRCP Candidate

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ‌వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ జూన్ 25, గురువారం నాడు నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఆయన నామినేషన్‌ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,‌ శ్రీకాంత్‌ రెడ్డి, అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ముందుగా టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తన పదవీకాలం మార్చ్ 29, 2023 వరకు ఉండగా, మార్చ్ 9, 2020 వ తేదీనే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైసీపీ పార్టీలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈసీ కి పంపించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటాలో ఈ స్థానం భర్తీ కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ తరపున మరోసారి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి అభ్యర్థి బరిలో ఉండకపోతే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎవరైనా అభ్యర్థి బరిలో ఉంటే జూలై 6న పోలింగ్‌ నిర్వహించి, అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here