వర్షాల నేపథ్యంలో తమిళనాడు రూ.10 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR Thanked Tamil Nadu CM Palaniswami, Heavy Rains In Hyderabad, Hyderabad Rains, Hyderabad Rains news, KCR Thanked Tamil Nadu CM, Rains In Hyderabad, Tamil Nadu CM Palaniswami, Tamil Nadu CM Palaniswami Contributing Rs 10 Crore Assistance, telangana, Telangana rains, telangana rains news, telangana rains updates

వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 10 కోట్ల నగదుతో పాటుగా బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, సీఎం పళనిస్వామికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే భారీవర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చాటాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu