జియో 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2500-3000 మధ్యలో?

5G Smartphones, Jio planning to sell 5G smartphones, Jio planning to sell 5G smartphones at Rs 2500-Rs 3000, Mukesh Ambani, Mukesh Ambani company Reliance Jio, national news, national political updates, Reliance Jio, Reliance Jio Planning, Reliance Jio Planning to Sell 5G Smartphones, Reliance latest news

రిలయన్స్ జియో దేశంలో తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధరను 5,000 రూపాయల కన్నా తక్కువకు విడుదల చేసి, క్రమంగా అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ ఆ ధరను రూ.2,500 నుంచి 3,000 కు తగ్గించాలని భావిస్తున్నట్టుగా రిలయన్స్ జియో కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 2జీ నెట్వర్క్ తో నడిచే ఫోన్లను 20-30 కోట్ల మంది వినియోగిస్తున్నారని, వారిని లక్ష్యంగా పెట్టుకునే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలకు కంపెనీ ప్రణాళికలు సిద్ధంచేస్తోందని అన్నారు. ‌

మరోవైపు దేశంలో ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్లు రూ.27 వేల నుంచి లభిస్తున్నాయి. ఇటీవల జరిగిన 43 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారతదేశాన్ని 2జీ ఫ్రీ దేశంగా మార్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2జీ వినియోగదారులే లక్ష్యంగా తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ‌

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − twelve =