రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, షెడ్యూల్ ఇదే…

Union Home Minister Amit Shah Hyderabad Tour Schedule on September 16-17, Union Home Minister Amit Shah, Amit Shah Hyderabad Visit, Amit Shah To Meet Tollywood Hero Prabhas , Amit Shah To Meet Prabhas, Mango News , Mango News Telugu, Home Minister Amit Shah, Union Minister Amit Shah, Amit Shah Hyderabad Tour, Minister Amit Shah And Prabhas Meet, Minister Amit Shah Latest News And Updates, Amit Shah And Prabhas Meeting, Prabhas News And Live Updates, Krishnam Raju Demise

బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు (సెప్టెంబర్ 16, శుక్రవారం) హైదరాబాద్‌ కు రానున్నారు. అమిత్ షా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటుగా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు “హైదరాబాద్ విమోచన దినోత్సవం” ను ఏడాదిపాటు జరుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏడాది పాటుగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే:

  • సెప్టెంబర్ 16, శుక్రవారం రాత్రి 9.50 గంటలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకుంటారు
  • అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకొని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఇక సెప్టెంబర్ 17, శనివారం ఉదయం 8.45 గంటల నుంచి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో నిర్వహించే హైదరాబాద్ విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
  • సభ అనంతరం బేగంపేటలోని హరిత ప్లాజాకు చేరుకొని బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీతో సమావేశం కానున్నారు.
  • మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌ కు చేరుకుని ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వికలాంగులకు ఉచిత వాహనాలను పంపిణీ చేయనున్నారు.
  • సాయంత్రం మళ్ళీ నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకొని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • ఇక రాత్రి 7.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =