తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీమణి శ్రీమతి శోభ సోమవారం యశోద ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆమె మోకాలి నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో నొప్పి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. అయితే వివిధ వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు ఆమోదం తెలుపడంతో ఆమెకు యశోద వైద్య బృందం ఈరోజు మోకాలి ఆపరేషన్ నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం శోభకు విశ్రాంతి అవసరమని, కొద్దిరోజుల బెడ్ రెస్ట్ అనంతరం యధావిధిగా ఆమె నడవవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ తన సతీమణిని పరామర్సించటానికి రానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక మొదటినుంచి ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి ఏదేని వైద్య సహాయం కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి రావడం అలవాటు. ఈ క్రమంలోనే శ్రీమతి శోభకు ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఆస్పత్రి యాజమాన్యం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY