మెద‌క్ జిల్లాకు సింగూరు జ‌లాల‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దే – మంత్రి హ‌రీష్ రావు

Minister Harish Rao Inaugurates Renuka Yellamma Lift Irrigation Project in Andol Today, Telangana Minister Harish Rao Inaugurates Renuka Yellamma Lift Irrigation Project in Andol Today, Harish Rao Inaugurates Renuka Yellamma Lift Irrigation Project in Andol Today, Harish Rao Launches Renuka Yellamma Lift Irrigation Project in Andol Today, Telangana Minister Harish Rao Inaugurated Renuka Yellamma Lift Irrigation Project in Andol Today, Telangana Minister Starts Renuka Yellamma Lift Irrigation Project in Andol Today, Renuka Yellamma Lift Irrigation Project in Andol, Renuka Yellamma Lift Irrigation Project, Lift Irrigation Project, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Finance Minister Harish Rao, Harish Rao, Renuka Yellamma Lift Irrigation Project News, Renuka Yellamma Lift Irrigation Project Latest News, Renuka Yellamma Lift Irrigation Project Latest Updates, Renuka Yellamma Lift Irrigation Project Live Updates, Mango News, Mango News Telugu,

మెద‌క్ జిల్లాకు సింగూరు జ‌లాల‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఆయన సంగారెడ్డి జిల్లాలో శ్రీ రేణుకా ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (టీఎల్‌ఐఎస్)ని సోమవారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు డ్రై రన్ ఇప్పటికే పూర్తయింది. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలోని 14 గ్రామాల పరిధిలో సుమారు ల‌క్షా 80 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించనున్నామ‌ని ప్రకటించారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్లే రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకునే అవకాశం కలిగిందని, దేశంలోనే అతిపెద్దదైన కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించుకున్నామని తెలిపారు.

గోదావ‌రి నదిని సింగూర్ ప్రాజెక్టుకు కలుపుతామని, తద్వారా అందోల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌ని హరీష్ రావు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూర్‌కు గోదావ‌రి జ‌లాల‌ను త‌ర‌లిస్తున్నామ‌ని వెల్లడించారు. మంజీరా నదిపై 15 చెక్ డ్యామ్‌లు నిర్మించామ‌ని, దీనికోసం రూ. 122 కోట్లను వెచ్చించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్రాగునీరు, సాగునీరుకు లోటు లేకుండా సీఎం కేసీఆర్‌ అద్భుత ప్రణాళికలు రూపొందిస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో నీటికి కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిర‌ణ్‌, జ‌డ్పీ చైర్మ‌న్ మంజుశ్రీ రెడ్డి, క‌లెక్ట‌ర్ శ‌రత్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 1 =