అక్టోబర్ 29 న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR will Inaugurate Dharani Portal, CM KCR will Inaugurate Dharani Portal on October 29, dharani portal, Dharani Portal on October 29, Telangana CM KCR, Telangana Dharani Portal, Telangana Dharani portal lauch, Telangana Dharani portal News, Telangana Dharani portal updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను అక్టోబర్ 29, గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ముందుగా ధరణి పోర్టల్ ను ఈ దసరా పండుగ రోజున ప్రారంభించాలని భావించగా, అక్టోబర్ 29 కి వాయిదా పడింది. ధరణి పోర్టల్ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండడంతో పాటుగా విచక్షణాధికారాలు లేకుండా ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ధరణి పోర్టల్ లో ఎంటర్ చేసే పక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇక అక్టోబర్ 29 న ప్రారంభోత్సవం నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్ సేవలు అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu