కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

#KCR, CM KCR, CM KCR will Review Tomorrow on Financial Losses, CM KCR will Review Tomorrow on Financial Losses To Telangana, Financial Losses Incurred by the state due to Corona, Financial Losses Incurred by the state due to Corona Pandemic, Latest Telangana News, Telangana CM KCR, Telangana News

కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే 2020-2021 బడ్జెట్ పై కూడా మధ్యంతర సమీక్ష జరుపుతారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ కూలంకషంగా చర్చ జరుపనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. మరోవైపు ఈ రోజు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలకు అనుగుణంగా ఆదివారం నాడు మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ