ఏపీ స్కూల్స్ లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల, 10వ తరగతిలో 50% హాజరు

Adimulapu Suresh About Students Attendance and Corona Measures in Schools, AP Minister Adimulapu Suresh, AP Students Attendance and Corona Measures in Schools, Corona Measures in Schools, Corona Measures in Schools In AP, Minister Adimulapu Suresh, Students Attendance, Students Attendance and Corona Measures in Schools

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్‌ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా మొదటి దశలో భాగంగా నవంబర్‌ 2 వ తేదీ నుంచి 9,10, ఇంటర్ మొదటి,‌ రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులును రోజు విడిచి రోజు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని వెల్లడించారు. నవంబర్ 2 న 42% విద్యార్థులు హాజరు కాగా, 3న 33.69%, 4న 40.30%, 5న 35%, 6 వ 43.89 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయినట్టు తెలిపారు. ముఖ్యంగా 10 వ తరగతి విద్యార్థులు హాజరు క్రమంగా పెరుగుతుందని, 6 వ తేదీ నాటికీ 10వ తరగతిలో 49.63 శాతం మంది విద్యార్థులు హాజరయినట్టు తెలిపారు.

మరోవైపు ఉపాధ్యాయుల్లో కూడా 89.86 శాతం మంది విధులకు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని పాఠశాలలలో కరోనా పరీక్షల నిర్వహించగా పాజిటివ్ గా తేలిన ఉపాధ్యాయులను హోమ్‌ ఐసొలేషన్లో ఉంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు. పాఠశాలల్లో కరోనా‌పై అవగాహన కల్పిస్తూ, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని నిబంధనలు పాటిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుంటూ కరోనా జాగ్రత్తలపై అందరిని అప్రమత్తం చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =