రెబల్ స్టార్ ప్రభాస్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారు పేరు అన్నారు. క్షత్రియులు కష్టపడి పనిచేయడం వల్ల ఎక్కడైనా సరే వారు విజయాన్ని అందుకుంటారని తెలియజేశారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ప్రశంసించారు. రెబల్ స్టార్ ప్రభాస్‌ది.. టాలీవుడ్. బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ రేంజ్ అని కితాబిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు సినిమా ఖ్యాతిని రెబల్ స్టార్ ప్రభాస్ కూడా దేశవ్యాప్తంగా విస్తరింఫేలా చేశారంటూ ప్రశంసించారు. హాలీవుడ్ రేంజ్ సినిమా బాహుబలిని ప్రభాస్ లేకుంటే అసలు ఎవరూ ఊహించలేమంటూ తెలియజేశారు.
కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పరిశ్రమ గురించి చెప్పలేము అని కూడా తెలియజేశారు. ఆయన మన మధ్య లేకపోవడం మరింత బాధాకరం అంటూ తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాంగోపాల్ వర్మ వంటి వారు బాలీవుడ్ లో సత్తా చాటారని కూడా తెలియజేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో కూడా రాజుల పాత్ర ఉందన్నారు. కొంపల్లిని పెద్ద నగరంగా క్షత్రీయులే చేశారన్నారు. మీడియా రంగంలో రాజులే రాణిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధకరం అన్నారు. బాలీవుడ్ లో సత్తా చాటిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనకు మంచి మిత్రుడు. హాలీవుడ్ రేంజ్ సినిమా ప్రభాస్ లేకుండా ఊహించలేమన్నారు.
రాజులను చట్టసభల్లోకి తీసుకుపోవాలనే ఆలోచన ఉందన్నారు. తొలుత పార్టీలో అవకాశం ఇస్తాం.. ఆ తరువాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాట ఇస్తున్నట్టు తెలిపారు. రాంగోపాల్ వర్మ తనకు మిత్రుడని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలని కోరారు సీఎం రేవంత్. మరోవైపు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ అని అన్నారు. ఆయన మాటిస్తే తప్పకుండా నిలబడతారని క్షత్రియ సమాజానికి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఐదు లక్షల జనాభా క్షత్రియులు ఉన్నట్లు క్షత్రియ సేవా సమితి సభ్యులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.