తెలంగాణ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్‌పై సంజాయిషీ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా నియోజకవర్గ ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరినట్లు వెలుగు చూసిన ఆడియో క్లిప్‌లో ఉంది. కాంగ్రెస్ తన నోటీసులో ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొంది. దీనిపై వెంకట్ రెడ్డి మరో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఒకవైపు ఎంపీ వెంకట్ రెడ్డి ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కూడా వెళ్ళలేదు, అదే సమయంలో ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ అభ్యర్ధికి ఓటు వేయవద్దని, తన తమ్ముడికి ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులను కోరినట్లుగా ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడం ఆ పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. దీంతో వెంకట్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లగా, పార్టీ రాజ్యాంగం ప్రకారం షోకాజ్ నోటీస్ జారీ అయినల్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు ఎంపీ కోమటిరెడ్డి స్పందించలేదు. పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై ఆయన ఎలా స్పందిస్తారనే దానిపై పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY