ఎన్డీయే కాదు, ఇండియా కాదు.. మరి పార్టీల పరిస్థితి ఏంటి?

Opposition vs NDA What The Role Plays by Non-Aligned Regional Parties in 2024 Elections,Opposition vs NDA,What The Role Plays by Non-Aligned Regional Parties,Non-Aligned Regional Parties,Non-Aligned Regional Parties in 2024 Elections,Mango News,Mango News Telugu,Mission 2024,Does opposition alliance have leadership,26 party alliance INDIA to challenge Modi,Political parties meet updates,Opposition vs NDA Latest News,Neutral parties, Not NDA, Not India And what is the condition of the parties,There are 64 parties in both alliances,Opposition vs NDA Latest News,Opposition vs NDA Latest Updates

ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉండటంతో.. బయటపడకపోయినా.. ఏ పార్టీకి ఆ పార్టీ లోలోపల ఎన్నికల సమరానికి కసరత్తులు ప్రారంభించాయి. అంతర్గత సర్వేలతో అల్లాడుతూనే.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎలా అయినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలవాలన్న కసితో.. అవసరం అయితే నలుగురిని కలుపుకొని పోయి అయినా అధికార పగ్గాలు చేపట్టాలని కసితో ఉన్నాయి. అందుకే విపక్ష పార్టీలన్నీ ఒక తాటికి చేరి ఇండియా పేరుతో ఒకటి అయ్యాయి. ఇండియాకు పోటీగా ఎన్డీయే కూడా రంగంలోకి దిగుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయేలోని 38 పార్టీల ఫ్యూచర్‌తో పాటు.. ఇండియా కూటమిలోన 26 పార్టీల భవిష్యత్తు తేలిపోనుంది. అంతేకాదు.. ఈ రెండు కూటమిలలోనూ చేరకుండా తటస్థంగా ఉన్న పార్టీలు భవిష్యత్ కూడా..వచ్చే ఎన్నికల్లో తేలిపోతుంది.

రెండు కూటముల్లో 64 పార్టీలే కాకుండా.. ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదశ్, భారత రాష్ట్ర సమితి, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్, తెలుగుదేశం పార్టీ, శిరోమణి అకాలీదళ్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, జనతాదళ్ సెక్యులర్, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ వంటి అనేక పార్టీలు తటస్థంగానే ఉండిపోయాయి. మరి ఇలా తటస్థంగా ఉండడం వల్ల రాజకీయంగా నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదని గత ఎన్నికల చరిత్ర రికార్డులతో సహా లెక్కలు చెబుతోంది. సాధారణంగా.. కూటములు ఆవిర్భవించినప్పుడు ప్రజల ఆలోచనలు దాదాపుగా కూటముల వైపే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఏదో ఒక కూటమికి ఓటేయడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటప్పుడు అటూ ఇటూ కాకుకండా ఏ పార్టీలో చేరని పార్టీలను పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని సార్లు ఆ పార్టీలు ఓట్లు దక్కించుకున్నప్పటికీ.. సీట్లపై ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈసారి తటస్థంగా ఉన్న పార్టీల్లో మెయిన్‌గా.. 10 పార్టీలు లోక్‌సభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి. ఆ తటస్ట పార్టీల మొత్తం సీట్ల సంఖ్య 64 గా ఉంది. కాగా.. ఈ పార్టీలన్నీ ఎన్నికల వరకు ఇలాగే ఏ పార్టీలోనూ కలవకుండా ఉంటే .. ఆ పార్టీల స్థాయి తగ్గే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మొదటిసారి జనతా పార్టీ పేరుతో.. ఒక కూటమి ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ నిర్ణయమే ట్రెండ్ సెట్గర్ ‌గా మారిపోయింది. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ వైపు కాకుండా, ఇటు జనతా పార్టీ వైపు కాకుండా ఉన్న పార్టీలు అన్నీ నష్టపోయాయి. ఈ ఎలక్షన్స్‌లో మొత్తం పోలైన ఓట్లలో.. పెద్ద పార్టీలైన కాంగ్రెస్, జనతా పార్టీలకు ఏకంగా 76 శాతం ఓట్లు రాగా.. తటస్థంగా ఉన్న వామపక్షాలు సీట్లు 19 కి తగ్గాయి. ఇక అతి ఎక్కువగా నష్టపోయింది మాత్రం డీఎంకేనే. ఆ పార్టీ బలం 23 నుంచి రెండు స్థానాలకు తగ్గి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో పడేసింది.

అలాగే 1989 లో జరిగిన ఎలక్షన్స్ ఫలితాలు కూడా.. తటస్టంగా ఉన్న పార్టీలు నష్టపోయే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. వీపీ సింగ్ నాయకత్వంలో.. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా జనతాదళ్, బీజేపీతో పాటు అనేక పార్టీలు కూటమి కట్టగా.. అప్పుడు మాయావతి, నితీష్ కుమార్‌లు మాత్రం ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉండిపోయారని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయిన విషయాన్ని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే 2019లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని.. ఆ పార్టీ 10 సీట్లు సాధించింది. అయినా కూడా ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే వెళ్తామని మాయావతి ప్రకటించడం పెద్ద సాహసం కిందే లెక్క. అలాగే మిగిలిన పార్టీలు కూడా తటస్టంగా ఉండి ఎలాంటి ఫలితాలను రాబడతాయో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =