సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Continental Hospitals Released Health Bulletin on Condition of Superstar Krishna's Health,Tollywood Senior Actor, Superstar Krishna Hospitalized,Superstar Krishna Illness,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

ప్రముఖ సినీయర్‌ నటుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయి హైదరాబాద్ లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం కాంటినెంటల్‌ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కృష్ణ క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారని, ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు.

“ఘట్టమనేని కృష్ణను ఈరోజు (నవంబర్ 14, సోమవారం) 01.15 AM కు గుండెపోటు పరిస్థితిలో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లోని అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. వైద్యులు వెంటనే సీపీఆర్ చేసి, 20 నిమిషాల్లో ఆయనకు పునరుజ్జీవనం అందించారు మరియు చికిత్స, పరిశీలన కోసం ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది మరియు వెంటిలేటర్‌పై ఉన్నారు. కార్డియాలజిస్ట్‌లు, న్యూరాలజిస్ట్‌లు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్‌లతో కూడిన వైద్య నిపుణుల బృందం అతని వైద్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా కృష్ణ పరిస్థితిని పరిశీలించారు” అని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు సూపర్‌ స్టార్‌ కృష్ణ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE