ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స

AP Minister Botsa Satyanarayana Fires on Janasena Chief Pawan Kalyan Over His Remarks on Jagananna Colonies,AP Minister Botsa Satyanarayana,Janasena Chief Pawan Kalyan,Jagananna Colonies,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,Ambati Rambabu,Botsa Satyanarayana

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గూడు లేని పేదలందరికీ ఇళ్ళు కట్టించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టారని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఈ కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన కట్టిస్తున్న ఈ ఇళ్ల కోసం మొత్తం 71 వేల ఎకరాల భూమిని సేకరించామని, ఇందులో 20 వేల ఎకరాల ప్రైవేట్ భూమి కూడా ఉందని చెప్పారు. ఈ భూమి కోసం రూ. 11 వేల కోట్లు కేటాయించామని, అలాగే కాలనీల్లో మౌలిక వసతులకు మరో రూ. 15 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి బొత్స వెల్లడించారు.

అయితే ఈ విషయాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసలు జనసేన రాజకీయ పార్టీ కాదని, అది ఓ సెలబ్రిటీ పార్టీ అని వ్యాఖ్యానించారు. పవన్ కేవలం ఆవేశంలో నోటికొచ్చింది మాట్లాడుతారని, ఆయన మాటలను ప్రజలు విశ్వసించరని మంత్రి అన్నారు. పేదలకు ఇళ్ళు కట్టిస్తుంటే దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అతి పెద్ద కార్యక్రమమని, ఎక్కడో ఒకచోట దొర్లినా చిన్న పొరపాట్లను పెద్దవిగా చేసి ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాగా ఆదివారం పవన కళ్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీని సందర్శించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =