కరోనా వ్యాప్తి: జీహెఛ్ఎంసీ పరిధిలో 92 కంటైన్మెంట్ జోన్లు

92 Containment Zones in GHMC, Containment Zones, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus outbreak, COVID-19, GHMC, GHMC Containment Zones, GHMC Containment Zones List, Hyderabad, telangana, Telangana Coronavirus

తెలంగాణలో జూలై 28, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,906 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటిన్ లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాల వివరాలు, ఆసుపత్రుల వారీగా అందుబాటులో ఉన్న బెడ్స్, కంటైన్మెంట్ జోన్స్ తదితర వివరాలను పూర్తిగా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో ఎక్కువుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జీహెఛ్ఎంసీలో జోన్ల వారీగా మొత్తం 92 కంటైన్మెంట్ జోన్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎల్బీ నగర్‌ జోన్ లో 5, చార్మినార్ జోన్‌లో 31, ఖైరతాబాద్ జోన్ లో 14, సికింద్రాబాద్ జోన్ లో 23, శేరిలింగంపల్లి జోన్ లో 10, కూకటల్ పల్లి జోన్ లో 9 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu