భారత్ లో కేవలం 18 రోజుల్లోనే 41 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్

Bharat Biotech International Private Limited, Corona Vaccination, coronavirus vaccine distribution, COVAXIN Under Phase 3 Trials, COVID 19 Vaccine, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, COVID-19 Vaccines To 7 More Countries After Nepal, Distribution For Covid-19 Vaccine, India Covid-19 Vaccination, Indian Government, Mango News, Vaccine Distribution

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో ఘనతను సాధించింది. కేవలం 18 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 40 లక్షలమందికి పైగా హెల్త్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసి, ఈ మార్కును ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా చేరుకున్న దేశంగా భారత్ అవతరించింది. 40 లక్షలమందికి వ్యాక్సిన్ వేసేందుకు అమెరికాకు 20, యునైటెడ్ కింగ్ డమ్ కు 39, ఇజ్రాయెల్ కు 39 రోజులు పట్టగా, భారత్ కు కేవలం 18 రోజులు పట్టింది. ఫిబ్రవరి 1నాటికి ప్రజలకు అందించే కరోనా వ్యాక్సిన్ డోసుల పరంగా భారత్ ప్రపంచంలో మొదటి ఐదు దేశాలలో ఒకటిగా నిలిచింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది.

గత 24 గంటల్లో మొత్తం 3,845 సెషన్స్ లో 1,88,762 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో ఫిబ్రవరి 3, బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 41,38,918 లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 76,576 కరోనా వ్యాక్సినేషన్ సెషన్లు నిర్వహించినట్టు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,87,252 మంది, తెలంగాణలో 1,70,043 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =