తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభలకు, ఒక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. నిన్ననే ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ ను ఎంఐఎం కైవసం చేసుకోగా.., మిగిలిన స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ చెరిసగం పంచుకున్నాయి. ఆ ఎన్నికల ఫలితాలను పార్టీలు ఇంకా విశ్లేషించుకుంటూ ఉన్నాయి. ఓడిన వారు కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలాఉండగానే.. తెలంగాణలో మరో ఎన్నికకు చెందిన పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగు రాకేశ్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తుండగా.. అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా తీన్మార్ మల్లన్నపై గెలుపు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫలితం తేలెందుకు చాలా సమయం పట్టనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నల్గొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హోసింగ్ గౌడన్స్‌లో లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. నాలుగు హాళ్లలో మెత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కిస్తున్నారు.
బరిలో 52 మంది అభ్యర్ధులున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839కి గానూ.. 3,36,013 ఓట్లు పోలయ్యాయి. అంటే 72.44% ఓటింగ్ జరిగింది. ఫలితం తేలేంత వరకూ కౌటింగ్ నిర్వహించనున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో 24 గంటల పాటు.. రెండు రోజులూ కొనసాగే అవకావం ఉంది. బుధవారం ఉదయం మొదట 25 ఓట్ల చొప్పున బండిల్స్ కట్టే ప్రక్రియ చేపట్టారు. తర్వాత చెల్లుబాటు అయిన ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను వేరుచేసే ప్రక్రియను కౌంటింగ్ సిబ్బంది మొదలు పెట్టారు. చెల్లుబాటైన ఓట్ల లెక్కింపులో సగంకంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలుపు మార్క్ గా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు మార్క్ ను ఎవరు రీచ్ కాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అభ్యర్ధులు గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకు ఎలిమినేషన్ పద్దతిలో కౌంటింగ్ జరగనుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే ఫలితం రేపు వెలువడే అవకాశం ఉంది. ఒక్కో షిప్ట్ లో 900 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం మూడు వేల మంది సిబ్బంది ఎమ్మెల్సీ బ్యాలెట్ కౌంటింగ్ లో పాల్గొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY