హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసులు 50 శాతానికి పెంచాలి, సీఎం కేసీఆర్ ఆదేశం

120 Cr for Payment of Pending Salaries, CM KCR, CM KCR Ordered to Release Payment of Pending Salaries of RTC, CM KCR Ordered to Release Rs 120 Cr, Govt will provide all support to TSRTC, Mango News Telugu, Pending Salaries of RTC Workers, Telangana CM KCR, Telangana RTC Pending Salaries, Telangana RTC Workers, TSRTC

కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తక్షణమే 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అలాగే హైదరాబాద్ నగరంలో సిటీ బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ఆర్టీసి పైన సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసి కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు.

ఇవాళ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసిని తిరిగి బతికించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తున్నది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్నది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రయివేటు భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా, వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి సహా, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ వస్తున్నది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది. అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకుని తిరిగి గాడిన పెట్టేదాక నేను నిద్రపోను. నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంట. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయి. దాంతో పాటు పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజా రవాణా వ్యవస్థ, ఆర్టీసిని కాపాడుకోవాలనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్టీసి కి ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. ఆర్టీసి కార్మికులకు ఇప్పటకే పెండింగులో వున్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలి. అందుకు తక్షణమే ఆర్ధికశాఖ 120 కోట్ల రూపాయలను విడుదల చేయాలి’’ అని స్పష్టం చేశారు.

కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సీఎం కు వివరించారు. కాగా, కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సీఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అధికారులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు ఆర్టీసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలి:

‘‘కరోనా అనంతర పరిస్థితుల నుంచి ఒక్కొక్క వ్యవస్థ గాడిన పడుతున్నది. ప్రజలు బైటికొస్తున్నరు. హోటల్లు దాబాలు తదితర ప్రజావసరాల రంగాలు తిరిగి కోలుకుంటున్నవి. జన సంచారం క్రమ క్రమంగా పుంజుకుంటున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాల్నో లోతుగా చర్చించండి.’’ అని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైదరాబాద్ కు జిల్లాల నుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుతుందని, అందుకోసం హైదరాబాద్ లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 5 =