మరో నెల రోజులు జైల్లోనే ఎమ్మెల్సీ కవిత

MLC Kavita, kavita arrest, delhi liquor scam case, brs,
MLC Kavita, kavita arrest, delhi liquor scam case, brs,

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటికి రావడం కష్టమేనా? అంటే పరిస్థితులు అవుననే సమాధానమిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ కూడా కవితపై కేసు నమోదు చేసింది. దాదాపు రెండున్నర నెలలుగా కవిత జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. అయితే మునుపెన్నడూ లేనట్లుగా ఈసారి ఏకంగా నెలరోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

సోమవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో.. ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని మరింత లోతుగా కేసును విచారించి సమాచారం రాబట్టాల్సి ఉందని కోర్టుకు విరించారు. అందువల్ల కవిత కస్టడీని పొడిగించి.. ఈడీ రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. అటు కవిత తరుపున న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించారు.

అయితే ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఈడీ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు కవితన జ్యుడీషియల్ కస్టడీని నెలరోజుల పాటు పొడిగించింది. దీంతో వచ్చే నెల 3వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు. ఇకపోతే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కవిత.. ఈసారి అరెస్ట్ అవ్వడం వల్ల పోటీకి, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున కవిత ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 2019లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు కవిత సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల షెడ్యూల్‌కు ఒక్కరోజు ముందే ఈడీ కవితను అరెస్ట్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY