ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియల వివాహం

On February 17 Raja Reddy And Priya Got Married, Raja Reddy And Priya Got Married, On February 17 Raja Reddy Married, Raja Reddy And Priya, YS Sharmila, YS RajaReddy, YS Sharmila Son Marriage, Priya Atluri, Latest Raja Reddy And Priya Marriage News, YS Sharmila Son Marriage News Update, AP News, AP Political News, CM Jangan, Andhra Pradesh, Polictical News, Elections, Mango News, Mango News
YS Sharmila, YS RajaReddy, YS Sharmila Son Marriage, Priya atluri

వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలో షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారని వార్తలొస్తున్నాయి. తన ప్రియురాలు అట్లూరి ప్రియను రాజారెడ్డి పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఇటీవల ప్రియ అట్లూరికి వైఎస్ విజయమ్మ చీర కూడా పెట్టింది. ఆ ఫొటోతో పాటు రాజారెడ్డి, ప్రియ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ద ఎత్తున వారి పెళ్లి గురించి చర్చ జరుగుతోంది.

అయితే ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కుమారుడి పెళ్లి గురించి నానా రచ్చ జరుగుతున్నప్పటికీ వైఎస్ షర్మిల స్పందించ లేదు. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా మొదటి సారి తన కుమారిడి పెళ్లి గురించి షర్మిల స్పందించారు. తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లికి సంబంధించి సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. అట్లూరి ప్రియతో తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి జరగనున్నట్లు ప్రకటించారు.

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన షర్మిల.. ఆ తర్వాత తన కుమారుడి పెళ్లి తేదీని ప్రకటించారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరిల ఎంగేజ్మెంట్ జనవరి 18న జరగనుందని.. ఫిబ్రవరి 17న వారి పెళ్లి జరగనుందని తెలిపారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ని సందర్శించనున్నామని.. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇక హైదరాబాద్‌లో రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని ఉమేద్ ప్యాలెస్‌లో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన రాజారెడ్డి.. కొద్దిరోజులుగా అక్కడే ఉంటున్నారు. అమెరికాలోని ప్రియ, రాజారెడ్డిలకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు స్నేహితులుగా ఉన్న ప్రియ, రాజారెడ్డి ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. ప్రస్తుతం ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 20 =