తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 7994 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 28, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,960 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 4009 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,49,692 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 81.71 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 58 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2208 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1630, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 615, రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాదులో 301, సిద్ధిపేటలో 269, సూర్యాపేటలో 264, మహబూబ్ నగర్ లో 263 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ