కొవాగ్జిన్ టీకా ట్ర‌య‌ల్ డోసు వేయించుకున్న హ‌ర్యానా మంత్రి అనిల్ విజ్

Anil Vij, Bharat Biotech Covaxin, Bharat Biotech Private Limited, Coronavirus Vaccine COVAXIN, COVAXIN, Covaxin 3rd Phase Clinical Trials, COVAXIN Clinical Trial, Haryana Health Minister, Haryana Health Minister Anil Vij, Haryana Health Minister Anil Vij Was Administered a Trial Dose, ICMR, Indian Council of Medical Research, Mango News, Phase III Trials Of COVID-19 Vaccine, Trials Of COVID-19 Vaccine

భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్ “కొవాగ్జిన్‌” పేరుతో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి హర్యానా రాష్ట్రంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా, కోవాగ్జిన్‌ టీకా ట్ర‌య‌ల్ డోసు తీసుకునేందుకు హ‌ర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ మొదటగా స్వచ్చంధంగా ముందుకొచ్చారు. 67 ఏళ్ల అనిల్ విజ్ అంబాలా కంటోన్మెంట్ లోని ఓ ఆసుపత్రిలో ఈ రోజు కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు.

మరోవైపు దేశంలోని 10 రాష్ట్రాలలో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ఢిల్లీ, ముంబయి, పాట్నా మరియు లక్నో వంటి 19 వేర్వేరు ప్రాంతాల్లో 18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 29000 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నట్టు తెలుస్తుంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ ట్రయల్స్ నిర్వహిస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =