రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ.300 : సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌

coronavirus vaccine, Covisheild, Mango News, Serum Institute Announces Covishield Price, Serum Institute fixes price of covid vaccine Covishield, Serum Institute of India, Serum Institute of India administration, SII Announces Covisheild Cost, SII announces Covishield prices, SII Announces Covishield Vaccine Prices, SII announces price of COVISHIELD for state govts, SII announces prices of Covishield for states, SII Reduces Covisheild Prices, SII Reduces Covisheild Prices At Rs 300, SII Reduces Covisheild Prices At Rs 300 From Rs 400 For State Governments, SII unveils Covishield price for states & private hospitals

కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధర తగ్గిస్తూ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.300 కు అందించనున్నారు. ఈ మేరకు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్ సీ పూనావాలా ఒక ప్రకటన చేశారు. “రాష్ట్రాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ.400 నుండి రూ.300 కు తగ్గించాము. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం వలన ముందుకెళ్లే కొద్దీ రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు ఆదా అవుతాయి. మరింత మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి, లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడడానికి దోహదపడుతుంది” అని అదర్ సీ పూనావాలా పేర్కొన్నారు.

ముందుగా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.400 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోసుకు రూ.600 చొప్పున విక్రయించనున్నట్టు సీరం సంస్థ ప్రకటించింది. అయితే రాష్ట్రాలకు, కేంద్రానికి వ్యాక్సిన్ విక్రయ ధరలో వత్యాసం ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ధరలు తగ్గించాలంటూ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వాలకు వ్యాక్సిన్ ధర తగ్గింపుపై సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి బుధవారం నాడు ప్రకటన వెలువడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − two =