తెలంగాణలో మరో 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 25, గురువారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11364 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 3616 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 230 కి పెరిగింది.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ లో 60, కరీంనగర్ లో 13, సిరిసిల్లలో 4, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో 3 కేసుల చొప్పున, వరంగల్ అర్బన్, మెదక్, ములుగు జిల్లాలలో 2 కేసులు చొప్పున, వరంగల్ రూరల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్, జనగామ, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 920 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 327 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4688 కి చేరింది. ప్రస్తుతం 6446 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu