తెలంగాణలో జూన్ 23 నాటికీ 96,51,844 కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Covid Vaccination in Telangana : 96,51,844 Vaccine Doses were Administered till June 23rd

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 23, బుధవారం రాత్రి 9 గంటల వరకు 80,61,298 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 15,90,546 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 96,51,844 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా బుధవారం నాడు 1,57,958 మందికి మొదటి డోస్, 9571 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు జూన్ 24, గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా‌సం‌స్థల్లో పనిచేస్తున్న ఉపా‌ధ్యా‌యులు, లెక్చరర్స్, సిబ్బం‌దికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు.

తెలంగాణలో జూన్ 23 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:

  • హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,51,380
  • హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,93,556
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,67,823
  • ఫ్రంట్‌లైన్ వర్కర్స్ (రెండో డోసు) :1,01,309
  • 45 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 45,97,575
  • 45 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 12,81,537
  • 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 29,44,520
  • 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 14,144
  • మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 96,51,844
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ