కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నగరంలోని సైబరాబాద్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించినట్లుగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. వేడుకలకు సంబంధించి పబ్లిక్, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31వ రాత్రి పబ్స్, రిసార్ట్స్, స్టార్ హోటల్ ఈవెంట్స్, ఫంక్షన్ హాల్స్, ఫార్మ్ హౌజ్ లు, అపార్ట్‌మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని అన్నారు. పోలీసుల నిఘా కొనసాగుతుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పబ్స్, స్టార్ హోటల్స్‌లో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని అన్నారు. డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ఉంటాయన్నారు. వేడుకలు నిషేదించిన నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ