ఆస్ట్రేలియాతో రెండవ టెస్ట్ ఆడబోయే భారత్ జట్టు ఇదే…

BCCI Announced Playing XI of Team India for the Second Test Against Australia,India Vs Australia 2nd Test Match 2020,India Vs Australia 2nd Test Match Playing 11,India Vs Australia Test Series 2020/21,Ind VS Aus 2nd Test Match Playing 11,Australia Vs India 2nd Test Match Playing 11,Ind Vs Aus Test Match 2020,ind vs aus 2nd test playing 11,ind vs aus 2nd test,india playing 11,bcci playing 11,BCCI Announced Team India Playing 11 For Boxing Day Test Match,Mango News,Mango News Telugu,BCCI,BCCI Announced Playing XI of Team India,India,Australia,BCCI Announced Team India Playing 11 For Boxing Day Test Match,Ind vs Aus 2020

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో టెస్టు డిసెంబర్ 26, శనివారం నాడు మెల్ బౌర్న్ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్టులో పుంజుకుని విజయంతో సత్తా చాటేందుకు భారత్ జట్టు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో ఆడ‌బోయే తుది భారత్ జ‌ట్టును శుక్రవారం నాడు బీసీసీఐ ప్ర‌క‌టించింది.

తోలి టెస్టులో తన ప్రదర్శనతో నిరాశపరిచిన యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఈ జాబితాలో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో చోటు దక్కించుకున్న శుబ్ మన్ గిల్ టెస్టుల్లో అరంగ్రేట్రం చేయనున్నాడు. అలాగే వికెట్ కీపర్ గా వృద్ధిమాన్ సాహా స్థానంలో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. ఇక తొలిటెస్టు ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ పాటర్నిటీ సెలవులో భాగంగా ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యాడు. కీలక పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి మణికట్టుకు గాయం కావడంతో ఈ టెస్టు ద్వారా మహమ్మద్ సిరాజ్ అరంగ్రేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా తుదిజట్టులో చోటుదక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌లో ఆడ‌బోయే భారత్ జ‌ట్టు ఇదే:

  1. శుభ్ మన్ గిల్
  2. మ‌యాంక్ అగ‌ర్వాల్‌
  3. చ‌టేశ్వ‌ర్ పుజారా (వైస్ కెప్టెన్)
  4. అజింక్య ర‌హానే (కెప్టెన్)
  5. హ‌నుమ విహారి
  6. రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
  7. రవీంద్ర జడేజా
  8. రవిచంద్రన్ అశ్విన్‌
  9. ఉమేష్ యాద‌వ్
  10. జ‌స్‌ప్రీత్ బుమ్రా
  11. మహమ్మద్ సిరాజ్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =