హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ప్రమాదం కొనితెచ్చుకోవడంతో పాటుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనదారుల విషయంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే చలానానే కదా కట్టి వెళ్ళిపోతే సరిపోతుందని భావించవద్దని చెప్పారు.
మొదటిసారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే మూడు నెలలు పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుందని, అలాగే రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు పంపించబడుతుందని చెప్పారు. నాణ్యమైన హెల్మెట్లు ధరించడం ప్రయాణానికి భరోసా ఇవ్వడమే కాకుండా లైసెన్స్ రద్దు కాకుండా కాపాడుతుందని చెప్పారు. అలాగే ద్విచక్ర వాహనం నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక వీడియోను విడుదల చేశారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ